Jai Sri Krishna.
Prasad Bharadwaj Incarnation 14 Blog
🌹. శ్రీమద్భగవద్గీత – 154 / Bhagavad-Gita – 154 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. తృతీయ అధ్యాయము – కర్మ యోగము – 35 🌴
35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||
🌷. తాత్పర్యం :
పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!
🌷. భాష్యము :
ప్రతియొక్కరు పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణభక్తిభావన యందు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. భౌతికప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మనుజుని స్థితి ననుసరించి విధింపబడిన ధర్మములే విధ్యుక్తధర్మములు.
ఇక శ్రీకృష్ణుని దివ్య సేవార్థమే ఆధ్యాత్మికగురువుచే ఒసగబడిన కర్మలు ఆధ్యాత్మికకర్మలు. భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతియొక్కరు పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విధ్యుక్తధర్మములను నిర్వహింపవలసియున్నది. ఆధ్యాత్మికస్థాయిలో ఒనరింపబడు కర్మలు మరియు భౌతికస్థాయిలో ఒనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుట కర్తకు సర్వదా లాభదాయకము.
గుణప్రభావము నందున్న మనుజుడు ఇతరులను అనుకరింప తన స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపవలెను. ఉదాహరణకు సత్వగుణము నందుండెడి బ్రాహ్మణుడు అహింసాపరుడుగా నుండును. కాని రజోగుణము నందుండెడి క్షత్రియుడు హింసాపూర్ణుడగుటకు ఆమోదయోగ్యమైనది. క్షత్రియుడైనవానికి హింసకు సంబధించిన నియమముల ననుసరించి నశించుట యనునది…
View original post 407 more words